Karimnagar: భగత్ సింగ్ ఆశయ సాధనకై యువత ఉద్యమించాలి!

Karimnagar: కరీంనగర్‌లో భగత్ సింగ్ 119వ జయంతి బోయవాడలో విగ్రహానికి ఏఐవైఎఫ్ నివాళి మతోన్మాదం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని యువనేత యుగంధర్ పిలుపు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Sept 2026 8:07 PM IST
Karimnagar
X

Karimnagar: భగత్ సింగ్ ఆశయ సాధనకై యువత ఉద్యమించాలి!

కరీంనగర్: భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్‌సింగ్‌ పోరాట స్పూర్తితో మతోన్మాద, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా అసమానతలు లేని సమాజ నిర్మాణానికి యువత ముందుకు సాగుతూ ఉద్యమించాలని, భగత్ సింగ్ ఆశయాలు నేటి యువతరం ముందుకు తీసుకెళ్లి ఉద్యమించాలని యుగంధర్ అన్నారు.

భగత్ సింగ్ 119వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బోయవాడలో గల భగత్ సింగ్ విగ్రహానికి ఏఐవైఎఫ్ నాయకులు పూలమాలవేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా పోరాడి, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తూ బ్రిటిషర్ల ఉరికంబాన్ని ముద్దాడి అమరత్వం పొందిన విప్లవ దృవతార షహిద్ భగత్ సింగ్ అని కొనియాడారు. వారి పోరాట స్పూర్తితో నేటి సమాజంలో అసమానతలపై, అందరికీ సమాన హక్కులకై, మతోన్మాదంపై, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా, దోపిడి, పీడన, అణిచివేత, కులమత లేని సమ సమాజ స్థాపనకై పోరాడుతూ అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ముందుకు సాగుతూ యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబోసుల సంతోష్ చారి, ఉపాధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్, పినమల్ల విజయభాస్కర్, నగర సహాయ కార్యదర్శి జువ్వాజితిరుపతి, జహీర్ ఖాన్,వర్ధన్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN