Siricilla: జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికైన బత్తుల అక్షరకు సన్మానం!

Siricilla: జమ్మూ కాశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన సిరిసిల్ల యువ క్రీడాకారిణి బత్తుల అక్షర. ఘనంగా సన్మానించిన ఉద్యమకారుల JAC.

KALEEM, SIRICILLA
Published on: 24 Sept 2026 11:32 AM IST
Siricilla
X

Siricilla: జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికైన బత్తుల అక్షరకు సన్మానం!

Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన బత్తుల అక్షరకు ఘన సన్మానం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్షరను శాలువాతో సత్కరించి అభినందించారు.

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బత్తుల నర్సిములు, లక్ష్మి దంపతుల కుమార్తె బత్తుల అక్షర. మల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తూనే క్రికెట్‌లో శిక్షణ పొందింది. పాఠశాల PET దాని నరేష్, ఫిజికల్ డైరెక్టర్ పొన్నం మహేందర్ సహకారంతో క్రీడలో ప్రతిభను మెరుగుపరుచుకుంది.

దమ్మన్నపేట ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో PET మంజుల ఆధ్వర్యంలో మరింత శిక్షణ పొందింది. 2019లో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి ఎంపికకు అర్హత సాధించింది. 2025లో ఖమ్మంలో, 2026లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది.

ప్రస్తుతం సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల PET డేవిడ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న అక్షర, జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది.

ఈ సందర్భంగా JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్ మాట్లాడుతూ అక్షరకు క్రీడల్లో మరింత ప్రోత్సాహం అందించేందుకు తన వంతుగా క్రికెట్ కిట్‌ను అందిస్తానని తెలిపారు. అక్షరలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ అధ్యక్షులు బుస్స వేణు, TUJAC కన్వీనర్ రాచర్ల వెంకన్న, పత్తిపాక పద్మశంకర్, JAC రాష్ట్ర నాయకులు కర్నె లక్ష్మి, గూగులోతు రేణ, మడుగుల వనజ, TVS జిల్లా కోఆర్డినేటర్ నడిమేట్ల శ్రీనివాస్, అడ్వకేట్ పశుల బాబు, సీనియర్ ఉద్యమ నాయకులు బలుమూర్తి, షేక్ సికిందర్, సయ్యద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

దాతల సహకారం కోరుతూ: అక్షరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం అందించాలనుకునే దాతలు కుటుంబ సభ్యులు అందించిన ఖాతాకు సహాయం చేయవచ్చు.

బ్యాంకు: State Bank of India

ఖాతా నంబర్: 40372462088

IFSC: SBIN0020295

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA