Tangallapalli: అంకుసాపూర్‌లో బాలామృతం ప్లస్‌పై అవగాహన కార్యక్రమం!
Tangallapalli: తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం ప్లస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించి, పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు.
Tangallapalli: అంకుసాపూర్‌లో బాలామృతం ప్లస్‌పై అవగాహన కార్యక్రమం!
Tangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలోని అంకన్‌వాడీ కేంద్రం-1లో బాలామృతం ప్లస్‌పై 10 నిమిషాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తంగళ్లపల్లి సెక్టార్ పరిధిలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి డీపీఓ వీరభద్రయ్య, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సూపర్‌వైజర్ సౌజన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు బాలామృతం ప్లస్ ప్రాధాన్యత, ప్రయోజనాలను వివరించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించేందుకు ప్రతి నెలా తప్పనిసరిగా బరువు తూయించాలని సూచించారు. ఆరేళ్లలోపు వయస్సు పిల్లల జీవితంలో అత్యంత కీలకమని, ఈ దశలోనే మెదడు ఎదుగుదల వేగంగా జరుగుతుందని తెలిపారు.
పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారిని చురుకుగా ఉంచాలని, ప్రభుత్వం అందిస్తున్న అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.




