Sircilla: ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయంలో బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ!

Sircilla: ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయంలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు. అధికారులతో కలసి బాల్యవివాహాల నిరోధానికి ప్రతిజ్ఞ చేయించిన ఎంఈఓ.

KALEEM, SIRICILLA
Published on: 24 Oct 2026 1:10 PM IST
Sircilla
X

Sircilla: ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయంలో బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో బాల్యవివాహాల రహిత భారత్ లక్ష్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సోషల్ వర్కర్ బొల్లె హరిబాబు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణహరి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర పాల్గొన్నవారితో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. తమ కుటుంబాల్లో, పరిసర ప్రాంతాల్లో, సమాజంలో బాల్యవివాహాలు జరగకుండా కృషి చేస్తామని, అలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు పంచాయతీ, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పిల్లల విద్య, భద్రతకు ప్రాధాన్యమిస్తూ బాల్యవివాహాల రహిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA