Peddapalli: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలే శరణ్యం!
Peddapalli: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని పెద్దపల్లి మండలంలోని ఆరు గ్రామాల్లో వ్యవసాయ అధికారి డి. నాగార్జున రైతులకు అవగాహన కల్పించారు.
Peddapalli: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలే శరణ్యం!
Peddapalli: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగు తగ్గించి ఆరుతడి పంటల సాగుపై పెద్దపల్లి మండలంలోని సబితం, రంగాపూర్, రాఘవాపూర్, గౌరెడ్దిపేట, అందుగులపల్లి మరియు దేవునిపల్లి గ్రామాలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.మండల వ్యవసాయ అధికారి డి. నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రైతులకు ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, వర్షపాతం తగ్గే అవకాశాలు మరియు నీటి లభ్యతపై కలిగే ప్రభావాలను వివరించారు.
రాబోయే యాసంగి పంట కాలంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలైన ప్రొద్దుతిరుగుడు, శనగ, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము తదితర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.ముఖ్యంగా వరి పంటకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతున్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు.
రైతులు తమ భూముల స్వభావం, నేల రకం, నీటి లభ్యత మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారి కె. సతీష్ కుమార్, సర్పంచులు నూనె సరోజన, గంట రమేష్, తాడిశెట్టి చామంతి, కొమ్ము సుజాత, బొక్కల రేఖ, ఉపసర్పంచులు ఇండ్ల మహేందర్, కొండ శ్రవణ్, కొడపత్రి వినోద్, పాలేటి వెంకటేష్, కడారి స్వప్న, వార్డు సభ్యులు మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.




