Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు నెలకు రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమం చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 490 మంది ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారని, తమకు కనీస వేతనంగా నెలకు రూ.18 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్ల నాయకురాలు మాట్లాడుతూ. మేము ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాము. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి గర్భిణీలను, పిల్లలను, వృద్ధులను చూసుకుంటున్నాము. అయినా మాకు కనీస వేతనం కూడా లేదు. నెలకు రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించే వరకు మా పోరాడుతాం కొనసాగిస్తాము.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.




