Sircilla: కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు!

Sircilla: కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు యత్నించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 3:21 PM IST
Sircilla
X

Sircilla: కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు!

Sircilla: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.18 వేల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గత నాలుగు నెలలుగా బీఎల్ఓ విధులతో అదనపు పనిభారం మోపుతున్నారని, ఇందుకు సంబంధించిన అదనపు చెల్లింపులు కూడా నిలిపివేశారని అంగన్‌వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఆయాల నుంచి టీచర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

విధుల ఒత్తిడితో మృతిచెందిన అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు హెచ్చరించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA