Manthani: ఈ నెల 8న కమాన్‌పూర్‌లో అఖిల పక్షం జేఏసీ ఆత్మీయ సమ్మేళనం!

Manthani: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఈ నెల 8న అఖిల పక్షం జేఏసీ ఆధ్వర్యంలో 'ఆత్మీయ సమ్మేళనం - అలాయ్ బలాయ్' నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

SHANKAR, MANTHANI
Published on: 2 Nov 2026 5:17 PM IST
Manthani
X

Manthani: ఈ నెల 8న కమాన్‌పూర్‌లో అఖిల పక్షం జేఏసీ ఆత్మీయ సమ్మేళనం!

Manthani: ఈ నెల 8 న పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అఖిల పక్షం జేఏసీ ఆధ్వర్యంలో "ఆత్మీయ సమ్మేళనం - అలాయ్ బలాయ్" కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. సోమవారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద "వాల్ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా దీపావళి పర్వదినం రోజున సమైక్యత బావాన్ని చాటిచెప్పెందుకు "ఆత్మీయ సమ్మేళనం - అలాయ్ బలాయ్" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్, సామాజిక కార్యకర్తలు, నాయకులు రాణవేన లక్ష్మీనారాయణ, కుక్క చంద్రమౌళి, చిప్పకుర్తి సత్యనారాయణ, దాసరి రాంచంద్రం, గుర్రాల చంద్రమౌళి, భూంపెల్లి మండయ్య, ఎండి కలీమోద్దీన్, మట్ట నర్సయ్య, మట్ట శంకర్, సుంచు శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI