Karimnagar: ఆదివాసీలకు అండగా ఉంటాం: ఫార్వర్డ్ బ్లాక్ నేత జోజిరెడ్డి!
Karimnagar: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, పోడు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర సెక్రటరీ అంబటి జోజిరెడ్డి స్పష్టం చేశారు.
Karimnagar: ఆదివాసీలకు అండగా ఉంటాం: ఫార్వర్డ్ బ్లాక్ నేత జోజిరెడ్డి!
కరీంనగర్: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర సెక్రటరీ అంబటి జోజిరెడ్డి అన్నారు. కరీంనగర్‌లో ఆదివాసీ హక్కుల సాధన సమితి (ట్రైబ్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ లకు భూమి హక్కులు కల్పించడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
పోడు భూముల రక్షణకు ఆదివాసీ ల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ఆదివాసీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు వారి సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో ఆదివాసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ ప్రతినిధులు పాల్గొన్నారు.




