Manthani: చట్టాలపై అవగాహనతోనే ఆత్మవిశ్వాసం: జడ్జి బి. అనురాధ
Manthani: మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు హక్కులు, బాధ్యతలపై నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి బి. అనురాధ ప్రసంగించారు.
Manthani: చట్టాలపై అవగాహనతోనే ఆత్మవిశ్వాసం: జడ్జి బి. అనురాధ
మంథాని: విద్యార్థులకు చట్టాల పట్ల అవగాహన కల్పించి, వారి హక్కులు, బాధ్యతలపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా మంథని గర్ల్స్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బి. అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు వివిధ చట్టాలు, వాటి ప్రాధాన్యత, విద్యార్థుల హక్కులు, చట్టపరమైన బాధ్యతల గురించి వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా అన్యాయాలను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
ఈ సదస్సులో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె. రాఘోత్తం రెడ్డి, న్యాయవాది కాచే శశిభూషణ్, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి ఝాన్సీ, రావుల తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.




