Sircilla: రెండోసారి ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి.. ఆది అభినందన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎడమల శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించి సన్మానించారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Nov 2026 3:10 PM IST
Sircilla
X

Sircilla: రెండోసారి ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి.. ఆది అభినందన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎడమల శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎడమల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆది శ్రీనివాస్ అందిస్తున్న ప్రోత్సాహం, సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA