Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో నూతన గెస్ట్ హౌస్ ప్రారంభం!

Sircilla: సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ వర్చువల్‌గా ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 4 Nov 2026 5:38 PM IST
Sircilla
X

Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో నూతన గెస్ట్ హౌస్ ప్రారంభం!

Sircilla: పోలీస్ శాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ (ఐఆర్) పోలీస్ బెటాలియన్ (టీజీఎస్‌పీ)లో నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

బెటాలియన్‌కు అధికారిక కార్యక్రమాలు, విధులు, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే పోలీస్ ఉన్నతాధికారులు, అతిథులకు మెరుగైన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆధునిక సదుపాయాలతో ఈ గెస్ట్ హౌస్‌ను నిర్మించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో బెటాలియన్‌లో వసతి సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణకు కూడా ఇది ఉపయోగపడనుంది.

ఎస్‌డీఆర్‌ఎఫ్ కార్యాలయానికి భూమి పూజ ఇదే కార్యక్రమంలో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు. విపత్తుల సమయంలో ప్రజలకు వేగవంతంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ కార్యాలయం కీలకంగా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో 17వ (ఐఆర్) పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ, అసిస్టెంట్ కమాండెంట్లు రాందాస్, రాజు, సంజీవరెడ్డితో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA