Ramagiri: రామగిరి ఖిల్లాను సందర్శించిన సినీ నటుడు నాగ చైతన్య!
Ramagiri: రామగిరి మండలంలోని చారిత్రక రామగిరి ఖిల్లాను సినీ నటుడు నాగ చైతన్య సందర్శించి, తన తదుపరి సినిమా చిత్రీకరణకు అనువైన లొకేషన్లను పరిశీలించారు.
Ramagiri: రామగిరి ఖిల్లాను సందర్శించిన సినీ నటుడు నాగ చైతన్య!
Ramagiri: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని చారిత్రక రామగిరి ఖిల్లాను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య సందర్శించారు. ఓ సినిమా చిత్రీకరణ నేపథ్యంలో అనువైన లొకేషన్లను పరిశీలించేందుకు ఆయన ఖిల్లాకు వచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఖిల్లా పరిసర ప్రాంతాలు, కొండపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను ఆయన పరిశీలించినట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణకు అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ, తన వెంట వచ్చిన బృంద సభ్యులతో చర్చించినట్లు సమాచారం.
సినీ నటుడు నాగ చైతన్య రామగిరి ఖిల్లాకు వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆయన పర్యటనతో రామగిరి ఖిల్లా ప్రాంతంలో సందడి నెలకొంది. చారిత్రక ప్రాధాన్యతతో పాటు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన రామగిరి ఖిల్లా సినిమా షూటింగ్లకు వేదికగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




