Karimnagar:జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏసీపీ మాధవి!

Karimnagar: జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో రజత పతకం సాధించిన హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవిని హుజురాబాద్ క్లబ్ నూతన కార్యవర్గం ఘనంగా సన్మానించింది.

RAJU, HUZURABAD
Published on: 29 Nov 2026 10:33 AM IST
Karimnagar
X

Karimnagar:జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏసీపీ మాధవి!

Karimnagar: జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో రజత పతకం సాధించి తెలంగాణ పోలీసులకు గర్వకారణంగా నిలిచిన హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవిని హుజురాబాద్ క్లబ్ నూతన కార్యవర్గం ఘనంగా సన్మానించింది.

క్లబ్ కార్యదర్శి కట్కూరి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు పుల్లూరి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు ఏసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ హుజురాబాద్ క్లబ్‌లోని షటిల్, జిమ్ తదితర క్రీడా సౌకర్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

జాతీయ స్థాయిలో రజత పతకం సాధించిన ఏసీపీ మాధవిని క్లబ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ధర్మారెడ్డి, నరసింహారెడ్డి, రాజిరెడ్డి, శ్రీకాంత్, సురేష్, అనిల్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD