Sillsilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజిలెన్స్ అవేర్‌నెస్ కార్యక్రమం!
Sillsilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఏసీబీ ఆధ్వర్యంలో ఉద్యోగులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పారదర్శక సేవలు అందించాలని డిఆర్ఓ సూచించారు.
Sillsilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజిలెన్స్ అవేర్‌నెస్ కార్యక్రమం!
Sillsilla: అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ఆడిటోరియంలో విజిలెన్స్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు పారదర్శకమైన, నిష్పక్షపాతమైన సేవలు అందించాలని, విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, అవినీతికి దూరంగా ఉంటూ ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
“మేము నైతిక వ్యాపార విధానాలను ప్రోత్సహిస్తాము.. నిజాయితీ, నిబద్ధతతో కూడిన సంస్కృతిని పెంపొందిస్తాము” అంటూ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు.




