Yellareddypet: గొల్లపల్లిలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. నివాళులు!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పిలుపు.

KALEEM, SIRICILLA
Published on: 26 Nov 2026 12:04 PM IST
Yellareddypet
X

Yellareddypet: గొల్లపల్లిలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. నివాళులు!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. రాజ్యాంగం ద్వారానే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు.

ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం కల్పించడంలో భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని, అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశానికి గొప్ప వరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గడ్డమీది సాయిచంద్, అందె సుదర్శన్, బహుజన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA