Sircilla: సిరిసిల్లలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Nov 2026 2:59 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. శంకరయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు తదితరులు విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారులు, సిబ్బంది ఎం. మహేష్ (గ్రేడ్-2), సిహెచ్. మాధవి, ఏ. కవిత, ఎన్. భీమరాజ్ (గ్రేడ్-3), ఆర్. రామకృష్ణ, బి. సాయిబాబాతో పాటు గ్రంథాలయ పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA