Sircilla: సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు!
Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి చేరిన 50 మంది యువకులు, మహిళలు. పాల్గొన్న పార్టీ నేతలు.
Sircilla: సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు!
Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా యువకులు, మహిళలు చేరారు. నియోజకవర్గ యువజన నాయకుడు సయ్యద్ జావిద్, మండల నాయకుడు బొమ్మనవేని పరుశరాములు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కవితక్క ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న కవితక్క ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని యువత పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.
కవితక్క ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి–ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తారని మజీద్ తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, రైతులు, మహిళలు, యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కవితక్క ఆదేశాల మేరకు పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ మహిళా ఇన్‌చార్జ్ కదిరే రేణుక, బొమ్మనవేని పద్మ, ఎల్లారెడ్డిపేట–ముస్తాబాద్ మండల ఇన్‌చార్జులు కదిరే భాస్కర్, మార్వాడి దేవరాజు, సీనియర్ నాయకులు ఆల్లె శంకర్, బందెల రాజు, చరణ్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.




