Ramagundam: రామగుండంలో 24/7 నీటి సరఫరా లక్ష్యం: మేయర్ మహంకాళి స్వామి
Ramagundam: రామగుండంలో 24/7 తాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నామని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రూ.100 కోట్లు మంజూరు చేయించారని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
Ramagundam: రామగుండంలో 24/7 నీటి సరఫరా లక్ష్యం: మేయర్ మహంకాళి స్వామి
పెద్దపల్లి జిల్లా: రామగుండం నీటి పంపిణీ వ్యవస్థ మెరుగు పర్చి 24/7 సరఫరా చేయడానికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ 11 వ డివిజన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల ఆవరణలో ఉపరితల జలాశయ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ కారెoగుల రమ్య ఆద్వర్యంలో మంగళ వారం నిర్వహించిన కార్యక్రమంలో భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపర్చడానికి ఎం ఎల్ ఎ ఎం ఎస్ . రాజ్ ఠాకూర్ సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని అన్నారు. ఇందులో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఎనిమిది ఉపరితల జలాశయాలు , కొత్త పైప్ లైన్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.
సుమారు రూ 2.00 కోట్ల అంచనా వ్యయంతో నర్శింగ్ కళాశాల ఆవరణలో నిర్మించతల పెట్టిన ఉపరితల జలాశయం సామర్ధ్యం ఎనిమిది లక్షల లీటర్లు ఉంటుందని సుమారు పది వేల జనాభా అవసరాలు తీరుస్తుందని అన్నారు. ఒక సంవత్సరం లోగా పనులు పూర్తి చేస్తామని అన్నారు.
కాగా అంతకు ముందు తాను కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న 46 వ డివిజన్ ఇందిరా నగర్ లో నిర్వహించిన మరో కార్యక్రమంలో సి సి రోడ్డు నిర్మాణ పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం లో ప్రతి వీధిలోని చివరి ఇంటివరకు కూడా అంబులెన్స్ వెళ్ళడానికి రోడ్డు , యు జి డి, రక్షిత మంచి నీటిని అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నామని అన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్నా గత పాలకులు పట్టించుకోకపోవడంతో మురికి కూపంగా మారిన ఇందిరా నగర్ లో రాజ్ ఠాకూర్ ఎం ఎల్ ఎ గా ఎన్నికైన తరువాత స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ నిర్మించి పైన జాలీ కూడా వేయించారని అన్నారు.
నడవ లేని పరిస్థితి ఉన్న ఇందిరా నగర్, సంజయ్ నగర్ లో రోడ్లు, యు జి డి, కొత్త వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయించామని అన్నారు. ప్రణాళికా బద్దంగా 46 వ డివిజన్ అభివృద్ది కి కృషి చేస్తున్న ఎం ఎల్ ఎ కు స్థానిక ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు దాసరి సాంబ మూర్తి, వడ్లూరి రవి, నాయకులు దాసరి విజయ్, కల్వల రంజిత్, కన్నూరి శంకర్, నగర పాలక సంస్థ ఎ ఇ మీర్, సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.




