Sircilla: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ మహేష్ బి.గితే
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ మహేష్ బి.గితే 19 ఫిర్యాదులను స్వీకరించి చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Sircilla: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ మహేష్ బి.గితే
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రజల నుంచి 19 ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి వినతులను స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు.
ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, తద్వారా పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించాలని అన్నారు. గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే గ్రీవెన్స్ డే కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.




