Sircilla: సిరిసిల్ల ఐడీఓసీ ప్రజావాణిలో 163 అర్జీలు స్వీకరణ.. కలెక్టర్ ఆదేశాలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ 163 అర్జీలను స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు.
Sircilla: సిరిసిల్ల ఐడీఓసీ ప్రజావాణిలో 163 అర్జీలు స్వీకరణ.. కలెక్టర్ ఆదేశాలు
సిరిసిల్ల: ప్రజావాణిలో ప్రజలు సమర్పించే అర్జీలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 163 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని సూచించారు.
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 4 దరఖాస్తులు, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 5 దరఖాస్తులు అందాయి. వీటిని సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మండలాల వారీగా దరఖాస్తుల వివరాలు:
బోయినపల్లి మండలంలో 4, చందుర్తిలో 0, ఇల్లంతకుంటలో 6, గంభీరావుపేటలో 2, కోనరావుపేటలో 3, ముస్తాబాద్‌లో 6, రుద్రంగిలో 0, తంగళ్లపల్లిలో 1, వీర్నపల్లిలో 1, వేములవాడ అర్బన్‌లో 3, వేములవాడ రూరల్‌లో 3, ఎల్లారెడ్డిపేటలో 2 దరఖాస్తులు అందాయి.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు.
ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.




