Jagtial: విద్యుత్ షాక్‌తో 10 నెలల చిన్నారి మృతి!

Jagtial: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో చార్జింగ్ పెట్టిన డిజిటల్ త్రాసును తాకి 10 నెలల చిన్నారి విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది.

RAMESH, DHARMPURI
Published on: 6 Nov 2026 11:29 AM IST
Jagtial
X

Jagtial: విద్యుత్ షాక్‌తో 10 నెలల చిన్నారి మృతి!

Jagtial: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి విభూది ఆద్య 10 నెలల చిన్నారి మృతి చెందింది.

ఇంటిలో ఆడుకుంటూ ఇంట్లో చార్జింగ్ పెట్టిన విద్యుత్ కాంటా తూకం వేసే త్రాసును ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి ఆద్య అక్కడికక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ చిన్నారి మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ దృశ్యం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI