Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో 1MW సోలార్ ప్లాంట్ ప్రారంభం

Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో రూ.3.8 కోట్ల వ్యయంతో నిర్మించిన 1 మెగావాట్ సోలార్ ప్లాంట్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించనున్నారు.

KONDAL, SULTANABAD
Published on: 26 Oct 2026 3:14 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో 1MW సోలార్ ప్లాంట్ ప్రారంభం

​కాల్వ శ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట సమీపంలో సింగిల్ విండో సహకార సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వన్ మెగావాట్ సోలార్ ప్లాంట్‌ను బుధవారం ప్రారంభించనున్నట్లు సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి తెలిపారు.

​ఈ ప్లాంట్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రధానమంత్రి కుసుమ్’ (PM-KUSUM) పథకం కింద, ‘రెడ్కో’ (REDCO) సహకారంతో పాండవుల గుట్టపై ఉన్న 597 సర్వే నంబర్‌లోని 4 ఎకరాల స్థలంలో రూ.3.8 కోట్ల భారీ పెట్టుబడితో ఈ సోలార్ ప్లాంట్‌ను ఆదర్శవంతంగా నిర్మించినట్లు పేర్కొన్నారు.

​బుధవారం జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, సహకార సంఘం డైరెక్టర్లు, సభ్యులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD