Jaggampeta: ధరల పెంపుపై కూటమిపై వైఎస్సార్‌సీపీ నేత మలిరెడ్డి ధ్వజం

Jaggampeta: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మలిరెడ్డి పాపారావు విమర్శించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 4 Oct 2026 6:35 PM IST
Jaggampeta
X

Jaggampeta: ధరల పెంపుపై కూటమిపై వైఎస్సార్‌సీపీ నేత మలిరెడ్డి ధ్వజం

కాకినాడ జిల్లా: జగ్గంపేట ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేడు నీటిమూటలయ్యాయి. ఒకవైపు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోగా, మరోవైపు రోజురోజుకూ.

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయస్సార్సీపి రాష్ట్ర బూత్ కమిటీల విభాగం కార్యదర్శి మలిరెడ్డి పాపారావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిత్యం వాడే బియ్యం, వంటనూనెలు, కాయగూరల ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో ధరలు సామాన్యుడికి అందుబాటులో లేక చుక్కలు చూపిస్తున్నాయని, దారుణమైన ధరల పెంపుతో పేద కుటుంబాల బతుకులు భారంగా మారాయని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్య జీవితంలో అతిముఖ్యమైన వస్తువుల ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.సబ్సిడీ ద్వారా సరుకులు అందించి పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం... ధరల నియంత్రణను గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. తక్షణమే స్పందించి నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావాలని, ఆయన ప్రభుత్వం నీ కోరారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA