Jaggampeta: రామవరంలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులు, రూ.5 లక్షల బీమా అందజేత!
Jaggampeta: జగ్గంపేట మండలం రామవరంలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులు, రూ. 5 లక్షల ప్రమాద బీమాను తోట శ్రీరాంజీ పంపిణీ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం.
Jaggampeta: రామవరంలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులు, రూ.5 లక్షల బీమా అందజేత!
జగ్గంపేట: జగ్గంపేట మండలం రామవరo గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దొడ్డ సూరిబాబు ఆధ్వర్యంలో, జగ్గంపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీ రాంజీ చేతుల మీదుగా వివిధ కమిటీలలో నియమించబడిన నాయకులకు కార్యకర్తలకు, ఐడీ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా తోట శ్రీ రాంజీ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడంలో ఐడీ కార్డులు ఒక ముఖ్యమైన ప్రతీక అని, వివిధ కమిటీలలో ఐడి కార్డులు కలిగిన ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా గా 5,00,000 లక్షల రూపాయలను ఇన్సూరెన్స్ పాలసీ చేయడం జరిగిందని ఇది కార్యకర్తలపట్ల ఎంతో ప్రేమఅనురాగాలతో , వెన్నుదన్నుగా ఉండాలని ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఇచ్చే భరోసాగా పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రతి కార్యకర్త ప్రజల్లో నిరంతరం అందుబాటులో ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని, గ్రామ స్థాయిలో కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన బలం అని, ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు నడిచి సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు
జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా మాట్లాడుతూ రామవరం గ్రామంలో కార్యకర్తలు అందరూ కూడా సమిష్టి కృషితో కష్టపడి పనిచేసి రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం గారిని 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. జిల్లా సగర సంగం అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి (ఆబ్బు)మాట్లాడుతూ రామవరం గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి వార్డు మెంబర్ల, సర్పంచ్ ,ఎంపీటీసీ లను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండలం సీనియర్ నాయకులు తుల్లా రాము, రాష్ట్ర కార్యదర్శి,కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఒమ్మి రఘురాం,రాష్ట్ర పబ్లిసిటీ విభాగం కార్యదర్శి, రామకుర్తి, జగాలు, కాకినాడ జిల్లా స్పోక్స్ పర్సన్ కరటూరి శ్రీను, కాకినాడ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రావుల స్వామి,కాకినాడ జిల్లా సగర సంగం అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి, కాకినాడ జిల్లా ఐటి విభాగం ప్రధాన కార్యదర్శి మొగిలి శ్రీనివాస్, కాకినాడ జిల్లా బూత్ కమిటీల మెంబర్ రావుల సురేష్ కుమార్ ,కాకినాడ జిల్లా కార్యదర్శి వరుపుల సూరిబాబు,నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కరటూరి వీర్రాజు, జగ్గంపేట మండలం ఉపాధ్యక్షుడు భూమాడి గణపతిరావు, జగ్గంపేట గ్రామ అధ్యక్షుడు కాపవరపు ప్రసాద్,గ్రామ జనరల్ సెక్రటరీ బండి నాగేశ్వరరావు యువజన విభాగం అధ్యక్షుల లింగంశెట్టి వీరబాబు, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు మండపాక రవికుమార్, చనిబోయిన కృష్ణ , గాది సత్తిబాబు మర్రి నూకరాజు, వీరభత్తుల శ్రీను, వీరబత్తుల జగన్, సింగిర్ల దుర్గాప్రసాద్, చింతపల్లి రాజేష్ , జుత్తుక లోవరాజు, చనిబోయిన నాగు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




