Kakinada: జగ్గంపేటలో ఘనంగా వైఎస్సార్‌సీపీ నేత జ్యోతుల చంటిబాబు జన్మదిన వేడుకలు!
Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.
Kakinada: జగ్గంపేటలో ఘనంగా వైఎస్సార్‌సీపీ నేత జ్యోతుల చంటిబాబు జన్మదిన వేడుకలు!
Kakinada: జగ్గంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు జ్యోతుల చంటిబాబు జన్మదిన వేడుకలను జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, అనంతరం కార్యకర్తలకు తినిపించారు.
ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామ మాజీ ఉపసర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ జ్యోతుల చంటిబాబు ప్రజల మనిషిగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, నిత్యం వారికి అండగా నిలిచే జ్యోతుల చంటిబాబు మళ్లీ నియోజకవర్గ ప్రజలకు నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు.
చంటిబాబు జన్మదిన వేడుకలను కార్యకర్తలు, అభిమానులతో కలిసి నిర్వహించడం ఆనందంగా ఉందని బండారు రాజా పేర్కొన్నారు.
కార్యక్రమంలో కంచి లక్ష్మణ్ దొర, దోమల గంగాధర్, అప్పారావు కాపు, పెద్దకాపు, బుద్దిరెడ్డి చెక్కరరావు, నగేష్, సబ్బి శీను, వీధి శ్రీను, కౌశిక్, గౌస్, చిట్టిబాబు, వివేక్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.




