Kakinada: ఏలేశ్వరంలో గాంధీ జయంతి వేడుకలు: ఎమ్మెల్యే సత్యప్రభ

Kakinada: కాకినాడ జిల్లా ఏలేశ్వరం షిరిడీ నగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నేత మేడిశెట్టి బాబి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 2 Oct 2026 2:36 PM IST
Kakinada
X

Kakinada: ఏలేశ్వరంలో గాంధీ జయంతి వేడుకలు: ఎమ్మెల్యే సత్యప్రభ

కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణం షిరిడి నగర్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి ముందుగా మాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.

అనంతరం వృద్ధులకు, మహిళలకు నాయకులు చేతులు మీదగా దుప్పట్లు పంపిణీ చేశారు.. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

మహాత్మా గాంధీజీ సూచించిన అహింస శాంతి, స్వచ్చత మార్గాల ద్వారా గ్రామాలు ప్రజా జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU