Prathipadu: ఏలేశ్వరం టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షిత నామినేషన్!
Prathipadu: ఏలేశ్వరం మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షిత నామినేషన్. అభ్యర్థి పేరు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ!
Prathipadu: ఏలేశ్వరం టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షిత నామినేషన్!
Prathipadu: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షిత పేరును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రకటించారు.
స్థానిక ఎన్ కన్వెన్షన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ అక్షితతో పాటు కూటమి పార్టీల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఏలేశ్వరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షిత నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నాయకుడు మేడిశెట్టి బాబి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, నియోజకవర్గ పరిశీలకురాలు పెంచెట్టి విజయలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.




