Tuni: వికసిత్ భారత్ సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి!

Tuni: తుని మండలం తేటగుంటలో 'సేవా జ్యోతి యాత్ర'ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనే ధ్యేయమని వెల్లడి.

MANIKANTA, TUNI
Published on: 3 Oct 2026 1:24 PM IST
Tuni
X

Tuni: వికసిత్ భారత్ సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి!

Tuni: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో డబుల్ ఇంజన్ సర్కార్ ముందడుగు వేస్తోందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని మండలం తేటగుంటలోని క్యాంప్ కార్యాలయంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్‌తో కలిసి ఆమె 'సేవా జ్యోతి యాత్ర'ను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు. ఈ బృహత్ కార్యంలో యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

యువతలో సేవా భావన పెంపొందాలని, దేశభక్తి, స్వచ్ఛత, సామాజిక బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువ శక్తి కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, ఈ యాత్ర ద్వారా సమాజంలో సానుకూల మార్పు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI