Pithapuram: పవన్ కళ్యాణ్ అభివృద్ధి చూసి ఓటెయ్యండి: దానం లాజర్ బాబు
Pithapuram: పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దానం లాజర్ బాబు కోరారు.
Pithapuram: పవన్ కళ్యాణ్ అభివృద్ధి చూసి ఓటెయ్యండి: దానం లాజర్ బాబు
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం శాసన సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దానం లాజర్ బాబు కోరారు.
పిఠాపురం పట్టణంలో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు వార్డు కౌన్సిలర్ పోటీ అభ్యర్థితో రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు.
బీఫాం పొందిన అభ్యర్థిగా నేనేనని తెలియజేశారు.కూటమి నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో 19 వార్డు ఐయితే నగర్ అభ్యర్థి సికోటి కమేశ్వరి, పెద్దఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




