Uppada: అర్ణబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పర్యటన!
Uppada: ఉప్పాడలో అర్ణబ్ తుఫాన్ ముప్పుపై కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సమీక్ష. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యం అందించాలని అధికారులకు కీలక సూచనలు.
Uppada: అర్ణబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పర్యటన!
ఉప్పాడ: అర్ణబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సమీక్షించేందుకు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఉప్పాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పాడ, సుబ్బంపేట ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించి, స్థానిక పరిస్థితులను సమీక్షించారు. అలాగే పునరావాస కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లపై ఆరా తీశారు
తుఫాన్ ప్రభావిత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు సహా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్, జనసేన పార్టీ నాయకులు గంట విజయ్ కుమార్, బాపన్న దొర, వంక కొండబాబు తదితరులు పాల్గొన్నారు.




