Uppada: మత్స్యకారుల కష్టంలో అన్నగా, రక్షణలో తండ్రిగా పవన్ కళ్యాణ్!
Uppada: కష్టంలో అన్నగా.. రక్షణలో తండ్రిగా పవన్ కళ్యాణ్ నిలిచారు: ఉప్పాడలో 1,250 మందికి పైగా బోటు యజమానులకు రక్షణ కిట్ల పంపిణీపై మత్స్యకారుల హర్షం.
Uppada: మత్స్యకారుల కష్టంలో అన్నగా, రక్షణలో తండ్రిగా పవన్ కళ్యాణ్!
ఉప్పాడ: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ రక్షణ సామగ్రిని అందించడం పట్ల ఉప్పాడ మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్పాడ గ్రామానికి చెందిన గంటా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మత్స్యకారుల కష్టాలను అర్థం చేసుకుని, వారి భద్రత కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆనందంగా ఉందన్నారు.
ప్రతి రక్షణ కిట్‌లో నాలుగు లైఫ్ జాకెట్లు, ఒక లైఫ్ బాయ్, బోటులో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ గన్, ఐస్ బాక్స్ వంటి సామగ్రిని అందించడం మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ఒక గ్రామానికి పరిమితంగా కాకుండా ఉప్పాడలో 1,250 మందికి పైగా ఉన్న బోటు యజమానులకు రక్షణ కిట్లు అందించేలా చర్యలు తీసుకోవడం మత్స్యకారుల భద్రతపై పవన్ కళ్యాణ్‌కు ఉన్న శ్రద్ధకు నిదర్శనమని గంటా విజయ్ కుమార్ పేర్కొన్నారు.
మత్స్యకారుల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఉప్పాడ బోటు యజమానులు, మత్స్యకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, భద్రత కోసం భవిష్యత్తులోనూ ఇదే విధంగా సహకారం అందించాలని కోరారు.




