Kakinada: పొన్నాడలో 14 హామీలతో ఉమ్మిడి చిన్న ఎన్నికల మేనిఫెస్టో!
Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ పంచాయతీలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఉమ్మిడి చిన్న 14 హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు.
Kakinada: పొన్నాడలో 14 హామీలతో ఉమ్మిడి చిన్న ఎన్నికల మేనిఫెస్టో!
Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీలో కూటమి బలపరిచిన ప్రెసిడెంట్ అభ్యర్థి ఉమ్మిడి చిన్న తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
పంచాయతీ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా 14 అంశాలతో ప్రత్యేక ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ముఖ్యంగా ప్రతి పేదింటి ఆడపిల్లకు రూ.10,116 ఆర్థిక సహాయం, గర్భిణీ స్త్రీలకు రూ.5,016 ఆర్థిక సాయం, పుట్టిన బిడ్డ కోసం బేబీ కిట్ అందిస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. దీపావళి, క్రిస్మస్ పండుగల సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తామని, చిన్నారులు ఆటలాడుకునేందుకు ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
కేవలం ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా.. గ్రామంలోని పేదలు, మహిళలు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని ఉమ్మడి చిన్న ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
14 అంశాల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చిన ఉమ్మిడి చిన్నకు పొన్నాడ పంచాయతీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




