Tuni: జనసేన పార్టీలో చేరిన సీనియర్ రాజకీయ నేత యనమల కృష్ణుడు

Tuni: తుని రాజకీయాల్లో సంచలనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు. శ్రేణుల్లో భారీ జోష్.

MANIKANTA, TUNI
Published on: 25 Sept 2026 9:08 PM IST
Tuni
X

Tuni: జనసేన పార్టీలో చేరిన సీనియర్ రాజకీయ నేత యనమల కృష్ణుడు

తుని: స్థానిక ఎన్నికల వేళ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పెను సంచలనం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా తుని రాజకీయాల్లో కీలక భూమిక వహిస్తున్న సీనియర్ నేత యనమల కృష్ణుడు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.

* జనసేనలో చేరిక: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యనమల కృష్ణుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

* ఉత్సాహంలో కేడర్: ఈ పరిణామంతో తునితో పాటు ఉమ్మడి జిల్లా జనసేన క్యాడర్‌లో ఎక్కడ లేని కొత్త ఉత్సాహం, జోష్ నిండింది.

* ప్రత్యర్థుల్లో టెన్షన్: స్థానిక రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న యనమల కృష్ణుడు పార్టీ మారడంపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ నడుస్తుండగా, ప్రత్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిణామం తుని నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI