Tuni: తుని నియోజకవర్గంలో జనసేనలోకి భారీ చేరికలు

Tuni: తుని మండలం హంసవరం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై 80 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. యనమల కృష్ణుడు కండువాలు కప్పారు.

MANIKANTA, TUNI
Published on: 11 Oct 2026 9:22 PM IST
Tuni
X

Tuni: తుని నియోజకవర్గంలో జనసేనలోకి భారీ చేరికలు

తుని: తుని మండలం హంసవరం గ్రామంలో జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు పడింది. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పార్టీ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ ఆశయాలు, సిద్ధాంతాలు, పారదర్శక రాజకీయ విధానం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు ఆ పార్టీలో చేరారు.

మాసా నాగేశ్వరావు, మసా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో హంసవరం గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మాసా ప్రకాష్ రావు, వాసంశెట్టి అచ్చరావు, కాకడ సురేష్, తలపంటి బాబురావు, ఉమ్మిడివరపు రామకృష్ణ, చిత్ర తాతారావు, అమలపు సత్యనారాయణ, చేకూరి బుచ్చిరాజు తదితరులు అధికారికంగా పార్టీ కండువాలు కప్పుకున్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త యనమల కృష్ణుడు గారు కొత్తగా పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికీ జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గ్రామస్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI