Tuni: తునిలో జనసేన సమన్వయ కమిటీ అభినందన సభ

Tuni: తుని పట్టణంలో కాకినాడ జిల్లా జనసేన సమన్వయకర్త యనమల కృష్ణుడు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల అభినందన సభ ఘనంగా జరిగింది.

MANIKANTA, TUNI
Published on: 11 Oct 2026 6:13 PM IST
Tuni
X

Tuni: తునిలో జనసేన సమన్వయ కమిటీ అభినందన సభ

తుని: తుని పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకినాడ జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్త యనమల కృష్ణుడు అధ్యక్షతన నూతనంగా పదవులు చేపట్టిన తుని నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల అభినందన సభ ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ సమన్వయకర్తలు, 32 మంది నిర్వాహక దళ్ సభ్యులు సపోర్ట్ టీం సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వార్డులు మరియు గ్రామాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేలా సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ అధిష్టానం అప్పగించిన ప్రతీ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI