Tuni: తునిలో వైభవంగా వినాయక నిమజ్జనం: వానలోనూ భక్తుల కేరింతలు

Tuni: కాకినాడ జిల్లా తుని పట్టణంలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

MANIKANTA, TUNI
Published on: 24 Sept 2026 9:09 PM IST
Tuni
X

Tuni: తునిలో వైభవంగా వినాయక నిమజ్జనం: వానలోనూ భక్తుల కేరింతలు

కాకినాడ జిల్లా, తుని: తుని పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ సాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఉత్సవం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

మరోవైపు, వరుణుడు ఎంతగా కరుణించకపోయినా, కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం భక్తులు ఏమాత్రం లెక్కచేయలేదు. స్వామివారిపై ఉన్న అంతులేని భక్తితో వేలాదిగా తరలివచ్చి నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రధాన వీధుల్లో కోలాహలం:

పట్టణంలోని శ్రీరామ థియేటర్ ప్రాంతం, కొబ్బరి తోట, అద్దాల వీధి గొల్ల అప్పారావు సెంటర్ తదితర ప్రధాన వీధుల .వినాయక విగ్రహాల ఊరేగింపు కనులపండువగా సాగింది. యువకులు, భక్తులు డప్పు వాయిద్యాలు, కోలాటాలు మరియు భక్తి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ జోరుగా సాగిన వర్షంలోనూ కేరింతలు కొట్టారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI