Pithapuram: యు కొత్తపల్లి ZPTC: తెలగంశెట్టి శ్యామల ముమ్మర ప్రచారం
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి జడ్పీటీసీ జనసేన అభ్యర్థిని తెలగంశెట్టి శ్యామల శ్రీరాంపురంలో గాజు గ్లాస్ గుర్తుపై విస్తృతంగా ప్రచారం చేశారు.
Pithapuram: యు కొత్తపల్లి ZPTC: తెలగంశెట్టి శ్యామల ముమ్మర ప్రచారం
కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలగంశెట్టి జడ్పిటిసి అభ్యర్థి శ్యామల. యు కొత్తపల్లి ZPTC ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ జడ్పిటిసి అభ్యర్థి తెలగంశెట్టి శ్యామల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రచారంలో భాగంగా ZPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలగంశెట్టి శ్యామల ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో కలియతిరుగుతూ ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా తెలగంశెట్టి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మమేకమవుతూ, జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుకు ఓటు వేసి తనను ZPTC గా గెలిపించాలని విజ్ఞప్తి
చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, తనకు అవకాశం కల్పిస్తే కొత్తపల్లి మండలం అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. ప్రచారానికి వచ్చిన నాయకులు పలు ప్రాంతాల్లో పర్యటించారు
మహిళలు హారతులు పట్టి పూల వర్షం తో గణస్వాగతం పలక డంతో పండగ సందడి నెలకొంది.




