Jaggampeta: జగ్గంపేట మండలం ఇర్రిపాకలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి సుర్ల అప్పారావు ప్రచారం!

Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఎంపీటీసీ అభ్యర్థి సుర్ల అప్పారావు ఇంటింటా ప్రచారం. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నవీన్ ఆశీస్సులతో ఓట్ల వేట.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 25 Oct 2026 7:00 PM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేట మండలం ఇర్రిపాకలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి సుర్ల అప్పారావు ప్రచారం!

Jaggampeta: జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు గౌరవ జ్యోతుల నెహ్రూ , కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులతో కూటమి పార్టీల బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుర్ల అప్పారావు శనివారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను కలిసి తమకు ఓటు వేసి ఎంపీటీసీగా గెలిపించాలని అభ్యర్థించారు.

తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీటీసీగా గెలిపిస్తే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో ఇర్రిపాక గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని తెలిపారు.

జగ్గంపేట జడ్పిటిసి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండిపోటీ చేస్తున్న జీను మణిబాబుకి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అన్నారు. రెండు ఓట్లు ఇస్తారని రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బస్వా చిన్న బాబు, టిడిపి సీనియర్ నాయకులు పంతం సత్యనారాయణ, జ్యోతుల నాగబాబు, జ్యోతుల సత్యమూర్తి, పంతం తమ్మి రాజుబాబు, కొండ్రపు సూరిబాబు, కోనేటి వెంకటేశ్వరరావు, జ్యోతుల బాబ్జి కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA