Kakinada: సర్పవరంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం పిల్లి దంపతుల ప్రచారం!
Kakinada: సర్పవరం గ్రామంలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Kakinada: సర్పవరంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం పిల్లి దంపతుల ప్రచారం!
Kakinada: సర్పవరం గ్రామంలో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థిని కర్రి ఆదిలక్ష్మి, సర్పవరం-1 ఎంపీటీసీ అభ్యర్థిని వాసంశెట్టి కుమారికి మద్దతుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులతో పాటు నియోజకవర్గ పరిశీలకుడు గన్ని కృష్ణ ప్రచారం చేపట్టారు.
గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన నాయకులు, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రజలతో మమేకమయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వాసంశెట్టి పోతురాజు, టీడీపీ కల్చరల్ విభాగం అధ్యక్షుడు రామ సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కాళ్ల శ్రీనివాస్, క్లస్టర్ కన్వీనర్, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకట్రాజు, టీడీపీ నాయకులు పుల్ల చందు, మాజీ సర్పంచ్ శీలం చిన్న, రాయుడు అనిల్, పిల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు.




