Peddapuram: పెద్దాపురంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ!

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 21 Oct 2026 12:55 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ!

Peddapuram: పెద్దాపురం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పెద్దాపురం సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని మోహరించి, నామినేషన్ల కేంద్రం వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM