Sircilla: గొల్లపల్లి అభివృద్ధి పనులకు నిధులకై మంత్రి పొన్నంకు వినతిపత్రం!
Sircilla: గొల్లపల్లి గ్రామాభివృద్ధి నిధులకై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్, నాయకులు. వెంటనే స్పందించి కలెక్టర్‌కు లేఖ రాసిన మంత్రి.
Sircilla: గొల్లపల్లి అభివృద్ధి పనులకు నిధులకై మంత్రి పొన్నంకు వినతిపత్రం!
Sircilla: గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, యువ నాయకుడు పొన్నాల వెంకటేష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గొల్లపల్లి నుంచి అకపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం, వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి బీబీజీ రాంజీ నిధుల నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు.
అలాగే బైపాస్ రోడ్డులోని శివాలయం నుంచి రాజన్నపేట రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి ఎల్లమ్మ గుడి మీదుగా గాలంగుట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతుల అవసరాల కోసం నిర్మించిన గోదాం ముందు డ్రైయింగ్ ప్లాట్ఫారం ఏర్పాటు చేయాలని కోరారు.
గ్రామంలో నాలుగు మహిళా సంఘ భవనాల నిర్మాణం, బతుకమ్మ ఘాట్ ఏర్పాటు, బీసీ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు భవనానికి రంగులు వేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఈ వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించి, అభివృద్ధి పనుల విషయమై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. గ్రామ అభివృద్ధి పనుల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రికి గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, యువ నాయకుడు పొన్నాల వెంకటేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




