Tuni: తుని వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం!

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై లారీ, కార్లు, బైక్‌లు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

MANIKANTA, TUNI
Published on: 11 Oct 2026 9:46 AM IST
Tuni
X

Tuni: తుని వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం!

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు మరియు సమాచారం ప్రకారం.. వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక లారీ, హైవేపై పనులు జరుగుతున్న వద్ద ముందు ఉన్న శాంత్రో కారును తీవ్రంగా ఢీకొట్టింది.

​ఈ ప్రమాద ధాటికి శాంత్రో కారు వెనుకకు తిరిగిపోయి నుజ్జునుజ్జయ్యింది. అదే క్రమంలో దాని ముందు ఉన్న మరో కారు, బలేరో వాహనంతో పాటు ఒక పల్సర్ బైక్ కూడా ప్రమాదానికి గురయ్యాయి. బలేరో వాహనానికి స్వల్ప దెబ్బలు తగలగా, కార్లు మరియు బైక్ తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

​ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే స్థానిక తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI