Pithapuram: పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానంలో లోక సంక్షేమం కోరుతూ వైభవంగా సహస్ర ఘటాభిషేకం, వరుణ జపాలు నిర్వహించారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 6 Oct 2026 4:09 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం!

Pithapuram: ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనల మేరకు, లోక సంక్షేమం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురియాలనే సంకల్పంతో శ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో సుమారు 150 పండితులచే, సహస్ర ఘట్టాభిషేకం, వరుణ జపములు తదితర వైదిక కార్యక్రమాలు ఆస్థాన పండితులు, పురోహితులు, అర్చక బృందంచే వేదోక్తంగా నిర్వహించబడినవి. అనంతరం అన్న వితరణ కార్యక్రమములో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమములో మాజీ శాసన సభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, చిక్కాల వరలక్ష్మి, తోట ఏడుకొండలు, జిల్లా దేవదాయ శాఖా అధికారి వర్ధినీడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram