Jaggampeta: రాజపూడి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా జామి నాగేశ్వరరావు

Jaggampeta: జగ్గంపేట మండలం రాజపూడి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా జామి నాగేశ్వరరావు (నాగు) ప్రకటన. ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 9 Nov 2026 8:17 PM IST
Jaggampeta
X

Jaggampeta: రాజపూడి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా జామి నాగేశ్వరరావు

జగ్గంపేట: జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున సర్పంచ్ అభ్యర్థిగా జామి నాగేశ్వరరావు (నాగు) పేరును జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ప్రకటించారు.

సోమవారం రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజపూడి గ్రామం నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ని కలిశారు. ఈ సందర్భంగా మా గ్రామంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు కలిసి ఏకాభిప్రాయంతో రాజపూడి కూటమి పార్టీల తరఫున సర్పంచ్ అభ్యర్థిగా జామి నాగేశ్వరరావు (నాగు)ను ప్రతిపాదిస్తున్నామని ఎమ్మెల్యేకు తెలియజేశారు.

గ్రామస్తుల ఏకాభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెంటనే జామి నాగేశ్వరరావు (నాగు)ను రాజపూడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీల అధికారిక సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ...

"రాజపూడి గ్రామస్తులంతా ఒక్క మాటపై నిలబడి నాగును ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నాగు గెలిస్తే గ్రామానికి మంచి రోజులు వస్తాయి. గ్రామంలోని ప్రతి వీధికి సీసీ రోడ్లు, తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు, పారిశుధ్యం, పచ్చదనం... ఇలా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తాం. రాజపూడిని జగ్గంపేట నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం" అని భరోసా ఇచ్చారు.

నూతన సర్పంచ్ అభ్యర్థి జామి నాగేశ్వరరావు (నాగు) మాట్లాడుతూ... "నాపై నమ్మకం ఉంచి ఏకాభిప్రాయంతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు పాదాభివందనాలు. నాకు పదవి ముఖ్యం కాదు, గ్రామ సేవే ముఖ్యం. ఎమ్మెల్యే నెహ్రూ గారి ఆశీస్సులతో, కూటమి నాయకుల సహకారంతో గ్రామంలో కక్షలు, విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుని పోతా. ప్రతి పనిలో పారదర్శకత, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేస్తా" అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజపూడి గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగుకు శుభాకాంక్షలు తెలిపారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA