Peddapuram: పెద్దాపురం మున్సిపల్ చైర్మన్‌గా రాజా సూరిబాబు ఘనవిజయం
Peddapuram: పెద్దాపురం మున్సిపల్ చైర్మన్‌గా సుమారు 14 వేల ఓట్ల మెజార్టీతో రాజా సూరిబాబు రాజు ఘనవిజయం సాధించి పట్టణ ప్రజలకు, కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Peddapuram: పెద్దాపురం మున్సిపల్ చైర్మన్‌గా రాజా సూరిబాబు ఘనవిజయం
పెద్దాపురం: పెద్దాపురం పట్టణ టీడీపీ కూటమి చైర్మన్ అభ్యర్థి రాజా సూరిబాబు రాజు ఘన విజయం సాధించిన సందర్భంగా పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 14 వేల ఓట్ల భారీ మెజారిటీతో తనను గెలిపించిన పట్టణ ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూటమికి కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల సమయంలో తమకు సహకరించి, ప్రజల్లో తమ విజయానికి కృషి చేసిన మీడియా సోదరులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తరహాలోనే రానున్న ఐదేళ్లలో పెద్దాపురం పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ ప్రజలకు అభివృద్ధిని కానుకగా అందిస్తానని రాజా సూరిబాబు రాజు స్పష్టం చేశారు.




