Tuni: వర్షంలోనూ నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు!

Tuni: కాకినాడ జిల్లా కలెక్టర్ సెలవు ఉత్తర్వులను తునిలో బేఖాతరు చేసిన శ్రీప్రకాష్, శ్రీచైతన్య విద్యాసంస్థలు. భారీ వర్షాల్లోనూ తరగతులు నిర్వహించడంపై తల్లిదండ్రుల ఆందోళన, అధికారుల చర్యలకు డిమాండ్.

MANIKANTA, TUNI
Published on: 4 Nov 2026 10:53 AM IST
Tuni
X

Tuni: వర్షంలోనూ నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు!

Tuni: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు నేడు (బుధవారం, 04-11-2026) సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. I&PR శాఖ ద్వారా ఈ సెలవు ప్రకటన వెలువడింది.

​అయితే, కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ తునిలోని శ్రీప్రకాష్ విద్యాసంస్థలు మరియు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నిబంధనలను ఉల్లంఘించి యథావిధిగా తరగతులు నిర్వహిస్తున్నాయి. వర్షం పడుతున్నప్పటికీ విద్యార్థులను కాలేజీలకు రప్పించడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​సెలవు రోజున కూడా కళాశాలలు నడుస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మరియు రెవెన్యూ అధికారులు స్పందించి, నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను వెంటనే సురక్షితంగా ఇళ్లకు పంపాలని కోరుతున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI