Pithapuram: ఘనంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్కర్స్ కార్తీక వన సమారాధన!

Pithapuram: పిఠాపురంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. నూతన కౌన్సిలర్లు రామన్నరాజు, రుద్రయ్యలను సత్కరించారు.

RAMA KRISHNA, KKD
Published on: 22 Nov 2026 7:44 PM IST
Pithapuram
X

Pithapuram: ఘనంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్కర్స్ కార్తీక వన సమారాధన!

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్, రివైండింగ్, ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మరియు ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు వియ్యపు రామన్నరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల సంక్షేమంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి:

ఈ సమావేశంలో యూనియన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం వంటి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వియ్యపు రామన్నరాజు మరియు యూనియన్ పెద్దలు మాట్లాడుతూ.. సంఘం భవిష్యత్ కార్యాచరణపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంతో అనుసంధానమై, కార్మికులకు అందవలసిన సంక్షేమ పథకాలు, లబ్ధిని చేకూర్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

నూతన కౌన్సిలర్లకు ఘన సన్మానం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా విజయం సాధించిన యూనియన్ సభ్యులు వియ్యపు రామన్నరాజు, కరణం రుద్రయ్యలను పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మహిళా నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవి ఘనంగా సత్కరించారు.అనంతరం 'శ్రీ సర్వేశ్వర ఏజెన్సీస్' అధినేత బోడా సతీష్ చేతుల మీదుగా నూతన కౌన్సిలర్లతో పాటు లక్ష్మీదేవిని కూడా శాలువా, పూలమాలలతో సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మరియు జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్, రివైండింగ్, ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులను పిఠాపురం యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.అనంతరం నిర్వహించిన కార్తీక వన సమారాధనలో టీడీపీ నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవితో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, పిఠాపురం నియోజకవర్గ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD