Prathipadu: టీ రాయవరం హత్య కేసును ఛేదించిన ప్రత్తిపాడు పోలీసులు
Prathipadu: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి రాయవరం చేపల చెరువు వద్ద జరిగిన నరసింహారావు హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Prathipadu: టీ రాయవరం హత్య కేసును ఛేదించిన ప్రత్తిపాడు పోలీసులు
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ఈనెల 11వ తేదీన ప్రత్తిపాడు మండలం టి రాయవరం చేపల చెరువు వద్ద జరిగిన హత్య కేసును ప్రత్తిపాడు పోలీసులు చేదించారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డిఎస్పి ఏ బి జి తిలక్ సమక్షంలో నిండుతుంది మీడియా ముందుకు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా డి ఎస్ పి తిలక్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం లక్ష్మీ నరసాపురం గ్రామానికి చెందిన వీర్ల జయ నాగ వెంకట సత్యనారాయణ అలియాస్ జయ బాబు, ఉద్దేశపూర్వకంగానే మోరు నరసింహారావును హత్య చేశాడని తెలిపారు.
అంతకుడు ఈ చేపల చెరువు వద్ద మేతను డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిపారు, మృతుడు కుమార్తె బలే నాగలక్ష్మి తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని అన్నారు.
ఈ క్రమంలో మృతుడు కూతుర్ని మందలించాడనే కారణంగా ఇద్దరూ పథకం ప్రకారం నిందితుడు జయబాబు అర్ధరాత్రి తన మోటార్ సైకిల్ పై చెరువు వద్ద వచ్చి మోరీ నరసింహమూర్తిని తనతో తెచ్చుకున్న చాకుతో కంఠంపై కోసి నడుంపై పొడిచే హత్యకు పాల్పడినట్టు తెలిపారు. బీరువాలో మృతుడే సెల్ఫోను, 2000 నగదు రోల్డ్ గోల్డ్ వస్తువులతో పరారైనట్టు తెలిపారు.
నిండుతుడిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఈ సందర్భంగా డిఎస్పి మీడియా ముఖంగా వెల్లడించారు. త్వరితగతిన ఈ హత్య కేసును చేదించిన సీఐ సూర్య అప్పారావు, ఎస్సై లక్ష్మీకాంతం, వారి టీం సభ్యులను జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఉన్నతాధికారులు అభినందించారనిఅన్నారు.




