Prathipadu: పెదశంకర్లపూడిలో ఓటు వేసిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా

Prathipadu: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుని ఏర్పాట్లను పరిశీలించారు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 5 Nov 2026 2:38 PM IST
Prathipadu
X

Prathipadu: పెదశంకర్లపూడిలో ఓటు వేసిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా

Prathipadu: ప్రత్తిపాడు మండలం, తన స్వగ్రామమైన పెదశంకర్లపూడి గ్రామంలో ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రజలకు పిలుపునిచ్చారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU